ఒక్క కశ్మీరీ పండిట్ కుటుంబాన్నైనా స్వస్థలానికి పంపారా?

ఒక్క కశ్మీరీ పండిట్ కుటుంబాన్నైనా స్వస్థలానికి పంపారా?

న్యూఢిల్లీ: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోమారు స్పందించారు. ఈ చిత్రాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఇంకోసారి ఆయన సూచించారు. అలాగే ఈ మూవీకి వచ్చిన వసూళ్లను కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం వినియోగించాలన్నారు. కశ్మీరీ పండిట్ల వలస విషయంపై బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉందని.. ఇన్నేళ్లలో ఒక్క కశ్మీరీ పండిట్ల కుటుంబాన్నైనా వారి స్వస్థలానికి పంపారా అని క్వశ్చన్ చేశారు. ఈ అంశం మీద బీజేపీ కావాలనే రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు.

కాగా, కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి గురువారం తొలిసారి అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ సినిమాకు ట్యాక్స్ మినహాయించాలని కోరుతున్నారని చెప్పారు. కానీ మూవీమేకర్స్ దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే.. అందరూ ఉచితంగా చూసే అవకాశం దొరుకుతుందన్నారు. ‘కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. బీజేపీ వాళ్లు మాత్రం సినిమా పోస్టర్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. పన్ను మినహాయింపు ఇవ్వడం కాదు .. వీలైతే ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయమని దర్శకుడికి చెప్పండి. దీంతో ప్రజలందరికీ ఈ సినిమా ఉచితంగా అందుబాటులో ఉంటుంది’ అని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఆప్‌ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం:

RRR ఓ మాస్టర్ పీస్

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

రికార్డు స్థాయి కలెక్షన్స్తో దూసుకెళ్తున్న RRR