ఏం జరుగుతున్నది? ఇండియాలో అడుగుపెట్టగానే మోదీ అడిగిన తొలి ప్రశ్న

ఏం జరుగుతున్నది? ఇండియాలో అడుగుపెట్టగానే మోదీ అడిగిన తొలి ప్రశ్న
  • దేశంలో పరిస్థితులను ఆరా తీసిన ప్రధాని
  • పార్టీ లీడర్లు ప్రజల్లోకి వెళ్తున్నారని చెప్పిన నడ్డా
  • తర్వాత సీనియర్ మంత్రులతో భేటీ

న్యూఢిల్లీ: ‘ఏం జరుగుతున్నది?’.. విదేశీ పర్యటన ముగించుకుని దేశంలో అడుగుపెట్టిన వెంటనే బీజేపీ నేతలను ప్రధాని నరేంద్ర మోదీ అడిగిన తొలి ప్రశ్న ఇది. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ ఆరాతీశారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, పర్వేశ్ వర్మ వెల్లడించారు. ‘‘ఇక్కడ ఎలా సాగుతోందని బీజేపీ చీఫ్ నడ్డాను ప్రధాని మోదీ అడిగారు. పార్టీ లీడర్లు ప్రజల్లోకి వెళ్తున్నారని, ప్రభుత్వ తొమ్మిదేండ్ల పాలన రిపోర్టు కార్డును వివరిస్తున్నారని, ప్రభుత్వంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని నడ్డా వివరించారు” అని మనోజ్ తివారీ చెప్పారు. ఆరు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన ముగించుకుని సోమవారం తెల్లవారుజామున ప్రధాని మోదీ ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన్ను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, పార్టీ చీఫ్ నడ్డా, ఎంపీలు హర్ష వర్ధన్, హన్స్‌‌‌‌‌‌‌‌ రాజ్, గౌతమ్ గంభీర్ తదితరులు స్వాగతం పలికారు. కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌లోని సీనియర్ మంత్రులు, అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్ తదితరులు హాజరయ్యారు.

ఇయ్యాల 5 వందే భారత్ రైళ్లు ప్రారంభం

మంగళవారం మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని పర్యటించనున్నారు. తొలుత రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌కు చేరుకుని.. 5 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. షాదోల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేస్తారు.

ALSO READ:టీఎన్జీవో యూనియన్​లో లొల్లి.. ముగ్గురు నేతల సభ్యత్వం రద్దు చేసిన సిటీ ప్రెసిడెంట్

బంధం మరింత బలంగా..: బైడెన్, మోదీ

‘‘అమెరికా, ఇండియా మధ్య స్నేహం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనదిగా మారింది. ఇది గతంలో కంటే బలంగా, దగ్గరగా, మరింత కీలకంగా ఉంది” అని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆదివారం ట్వీట్ చేశారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘‘నేను మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. మన రెండు దేశాల స్నేహం.. ప్రపంచానికి మేలు చేసే శక్తి. నా తాజా పర్యటన మన బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది’’ అని ట్వీట్ చేశారు