ఇదెక్కడి దోపిడీ : రైలు టికెట్ల రద్దుతో.. రూ.4 వేల కోట్లు సంపాదించిన రైల్వేశాఖ

ఇదెక్కడి దోపిడీ : రైలు టికెట్ల రద్దుతో.. రూ.4 వేల కోట్లు సంపాదించిన రైల్వేశాఖ

రైలు ప్రయాణం.. రైల్లో జర్నీ కంటే టికెట్ కన్ఫర్మరేషన్ అనేది పెద్ద తలనొప్పి అనేది అందరికీ తెలిసిందే.. ఆన్ లైన్ బుకింగ్ వచ్చిన తర్వాత రైల్వే శాఖ ఆదాయం భారీగా పెరిగిందంట.. అవును.. రైళ్లలో జనం ప్రయాణించకపోయినా.. జనం రైలు ఎక్కకపోయినా.. ఒకే ఒక్క సంవత్సరంలో.. అది కూడా 2022.. 23 ఆర్థిక  సంవత్సరంలో రైల్వే శాఖ అక్షరాల 2 వేల 110 కోట్ల రూపాయలు సంపాదించింది. అదే విధంగా 2023.. 24 (డిసెంబర్ వరకు) వెయిటింగ్ లిస్టు, రైల్వే టికెట్ రద్దు ద్వారా ఒక వెయ్యి 762 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఓవరాల్ గా రెండేళ్లలో వెయిటింగ్ లిస్టులోని టికెట్ రద్దు, టికెట్ల క్యాన్సిలేషన్ ద్వారా రైల్వే శాఖ అక్షరాల 3 వేల 871 కోట్ల రూపాయలు సంపాదించింది. రైల్లో జనం ప్రయాణించకుండా ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించింది అంటారా.. అదే మ్యాజిక్.. జనం నుంచి ఇలా కూడా డబ్బులు రాబట్టుకోవచ్చు అంటూ ఎక్స్ (X)లో ట్విట్లు ఎడాపెడా పోస్ట్ అవుతున్నాయి.. అంతా మోదీ డిజిటల్ మ్యాజిక్ మహిమ..

ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామా..  మీరు ఆన్ లైన్ ద్వారా వెయిటింగ్ లిస్టు కింద ట్రయిన్ టికెట్ బుక్ చేసుకున్నారు.. టికెట్ బుకింగ్ తర్వాత 240 రూపాయలు అయ్యింది.. ఆన్ లైన్ ద్వారా కట్టేశారు. అయితే మీకు వెయిటింగ్ లిస్టులోని టికెట్ కన్ఫర్మేషన్ కాలేదు.. మీకు రైలులో బెర్త్ లేదా సీటు దొరకలేదు కాబట్టి.. వెయిటింగ్ లిస్టులోని మీ టికెట్ రద్దు అవుతుంది. మీరు చెల్లించిన 240 రూపాయలు మళ్లీ తిరిగి మీ అకౌంట్ లోకి రావాలి కదా.. అబ్బే అలా జరగటం లేదంట.. 240 రూపాయలకుగాను.. 180 రూపాయలు రీఫండ్ అవుతున్నాయి. అదేంటీ మిగతా 60 రూపాయలు ఏంటీ అంటే.. సర్వీస్ ఛార్జీలు.. మీరు రైల్వేశాఖ వెబ్ సైట్, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉంటాయి కదా.. అవి కట్ చేసుకుని.. 180 రూపాయలు ఇస్తున్నారంట.. 

ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. మీరు రైలు ఎక్కలేదు.. రైలులో ప్రయాణించలేదు.. జస్ట్ వెయిటింగ్ లిస్ట్ కింద టికెట్ బుక్ చేసుకున్నారు అంతే.. డబ్బులు కట్ అయ్యాయి. ఈ విధంగా రెండు సంవత్సరాల్లోనే 4 వేల కోట్ల రూపాయలు రైల్వేశాఖ సంపాదించింది. 

ఎక్స్ లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. RTI కింద బాల్ తివారీ అనే వ్యక్తి సమాచారం కోరగా.. ఈ విధమైన సమాచారం వచ్చిందంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి రైల్లో ప్రయాణం చేయకుండానే టికెట్ బుకింగ్, రద్దు పేరుతో రైల్వే శాఖ డిజిటల్ దోపిడీ చేస్తుందంటూ మండిపడుతున్నారు మరికొంత మంది నెటిజన్లు. మొత్తంగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ పోస్టుపై రైల్వేశాఖ కానీ.. IRCTC కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.. చూడాలి రాబోయే రోజుల్లో ఏమైనా సమాధానం చెబుతుందో మరి...