భద్రాచలం/ మంగపేట, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. గురువారం ఆమె భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకుని, పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మేడారం సమ్మక్క-సారక్క తరహాలోనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని కూడా మొదటివిడతలో రూ.351 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ అభివృద్ధి పనులకు సహకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెం రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంత్రి సీతక్క చెక్కులను అందజేశారు.
