న్యూఢిల్లీ: ఖలిస్తానీ లీడర్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అమెరికాలో దాఖలు చేసిన కేసును భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కేసులో అమెరికా కోర్టు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ సమంత్ గోయల్‌కు సమన్లు జారీ చేయడాన్ని తప్పుబట్టింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పరిణామంపై స్పందిస్తూ.. ‘ఇటువంటి నిరాధారమైన వ్యాజ్యాలను మేము తిరస్కరిస్తున్నాం.
దీనిపై మా వైఖరి ఇదే’ అని ప్రభుత్వం పేర్కొంది. పన్నూన్ ఆరోపణలను ‘కల్పితమైనవి, ఉద్దేశపూర్వకమైనవి’ గా భారత్ అభివర్ణించింది. పన్నూన్‌ను భారత్ ఇప్పటికే వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అతనిపై పలు ఉగ్రవాద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టులో అతను దాఖలు చేసిన సివిల్ సూట్ రాజకీయ ప్రేరేపితమని భారత అధికారులు అభిప్రాయపడుతున్నారు.
