కాశీబుగ్గ, వెలుగు: వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ తొలిసారిగా క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో స్థానం సంపాదించిందని యూనివర్సిటీ ఛాన్స్లర్ ఏ.వరదారెడ్డి తెలిపారు. గురువారం హనుకొండలో మాట్లాడుతూ ఆసియా స్థాయిలో 701-710 ర్యాంక్ బ్యాండ్లో నిలిచినట్లు వెల్లడించారు. అలాగే, దేశంలోని రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 19వ స్థానం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానం సాధించినట్లు పేర్కొన్నారు.
తొలిసారిగా ర్యాంకింగ్స్లో ప్రవేశించినప్పటికీ, ఆసియాలో ర్యాంకులు పొందిన విశ్వవిద్యాలయాల్లో దాదాపు 60 శాతం సంస్థలను అధిగమించడం విశేషమన్నారు. క్యూఎస్ ర్యాంకింగ్స్లో అకడమిక్ ప్రతిష్ఠ, ఉద్యోగదాతల అభిప్రాయాలు, పరిశోధన పనితీరు, అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, అంతర్జాతీయ పరిశోధనా నెట్వర్క్లు, భాగస్వామ్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు.
