కోర్టుకు ఒకటి... ఆచరణలో మరొకటా?..హిందీ పండిట్‌‌‌‌ గ్రేడ్‌‌-2 నియామకాల తీరుపై హైకోర్టు ఆగ్రహం

కోర్టుకు ఒకటి... ఆచరణలో మరొకటా?..హిందీ పండిట్‌‌‌‌ గ్రేడ్‌‌-2 నియామకాల తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ-2002 నోటిఫికేషన్‌‌ కింద హిందీ పండిట్‌‌ గ్రేడ్‌‌-2 నియామకాలకు సంబంధించి కోర్టుకు ఒకటి చెప్పి ఆచరణలో మరోలా వ్యవహరిస్తారా అంటూ విద్యాశాఖ అధికారులను హైకోర్టు బుధవారం నిలదీసింది.  డీఈఓల సిఫారసులు, జిల్లాల వారీగా ఖాళీలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందుకు కారణాలు చెప్పాలని ఆదేశిస్తూ విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టు 2022లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం డీఎస్సీ-2002 నోటిఫికేషన్‌‌లో తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని నియమించడంపై ఇచ్చిన వినతి పత్రాలపై చర్యలు తీసుకోకపోవడం పట్ల 2025లో సంధ్య తదితరులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ వేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ పి.శ్యాంకోశీ విచారణ చేపట్టారు. గతంలో కోర్టు ముందు చేసిన ప్రభుత్వ న్యాయవాది వాదనలు, రికార్డుల్లో ఉంచిన సిఫారసులను పరిగణలోకి తీసుకోకుండా వినతి పత్రాలను తిరస్కరించడాన్ని పరిశీలిస్తే అధికారులు ముందే నిర్ణయించుకుని తిరస్కరించినట్లుందని కోర్టు  వ్యాఖ్యానించింది.