ఒకేషనల్ ట్రైనర్లు, కోఆర్డినేటర్ల జీతాలకు లైన్ క్లియర్

ఒకేషనల్ ట్రైనర్లు, కోఆర్డినేటర్ల జీతాలకు లైన్ క్లియర్

హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఒకేషనల్ ట్రైనర్లు, కోఆర్డినేటర్ల జీతాలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రాష్ట్రవ్యాప్తంగా 13 ఏజెన్సీల కింద సేవలందిస్తూ కొంతకాలంగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న వీరి పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ శుక్రవారం జీవో 1775ను జారీ చేశారు.

దీంతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వీరి సేవలను వినియోగించుకోవడంతోపాటు త్వరలోనే జీతాలు అందనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్పర్శ్ విధాన నిబంధనలకు అనుగుణంగా తాజాగా జారీ చేసిన జీవోలో జీతాలను ఔట్​సోర్సింగ్ జాబితా నుంచి యాక్టివిటీ విభాగంలోకి మార్చారు. దీంతో ఇకపై నేరుగా ఆయా ఏజెన్సీలకే వేతనాలు అందించనున్నారు. త్వరలోనే ట్రైనర్లు, కోఆర్డినేటర్ల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.