తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌ కు ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌ కు ప్రశంసలు

న్యూఢిల్లీ, వెలుగు: మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, సంక్షేమం – సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలు జాతీయ ప్రశంసలు అందుకున్నాయి. సోమవారం న్యూఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కార్యాలయంలో జాతీయ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ విజయ కిషోర్ రహత్కర్ ను  తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్  నేరెళ్ల శారద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీలో మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంలో వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం పెంపొందించడంపై కీలక చర్చ జరిగింది. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ వేధింపులు, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలతో పాటు, గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి, పారిశ్రామిక అవకాశాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించారు.