కార్తీక కాంతులు.. స్వామి వ్రతాలు

 కార్తీక కాంతులు.. స్వామి వ్రతాలు
  • యాదగిరిగుట్టలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న1080 మంది దంపతులు  

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం కార్తీక కాంతులతో కొత్త కళ సంతరించుకుంది. శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో.. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి యాదగిరిగుట్టకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కార్తీక పూజల్లో భాగంగా సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపారాధనలో భాగంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

 సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించుకోవడానికి భక్తుల ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో వ్రత మండపాలు కిక్కిరిశాయి. శనివారం ఒక్కరోజే 1080 మంది దంపతులు వ్రత పూజలు జరిపించుకున్నారు. కేవలం వ్రతాల నిర్వహణ ద్వారానే శనివారం ఆలయానికి రూ.10.80 లక్షల ఆదాయం వచ్చింది. భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శనివారం ఆలయానికి రూ.39,50,375 ఇన్ కమ్ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.