త్రీవ్ర విషాదం : టెన్త్ లో స్కూల్ ఫస్ట్ .. అనారోగ్యంతో స్టూడెంట్ మృతి

త్రీవ్ర విషాదం : టెన్త్ లో స్కూల్ ఫస్ట్ .. అనారోగ్యంతో స్టూడెంట్ మృతి
  • గత నెల 17న చికిత్సపొందుతూ చనిపోయిన విద్యార్థిని  
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లాపూర్ లో విషాదకర ఘటన

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన టెన్త్ స్టూడెంట్ గత నెల 17న అనారోగ్యంతో చనిపోగా.. టెన్త్ రిజల్ట్ లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రవి, -రజిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కూతురు నాగచైతన్య స్థానిక ప్రభుత్వ స్కూల్ లో పదో తరగతి చదువుతుండగా.. ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. 

గత మార్చిలో టెన్త్ ఎగ్జామ్స్ రాసిన కొద్దిరోజులకు ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. పరిస్థితి విషమించి మృతి చెందింది. కాగా బుధవారం టెన్త్ ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. తన రిజల్ట్ చూసుకునేందుకు తమ కూతురు లేకపోయిందని కుటుంబ సభ్యులు విలపిస్తూ పేర్కొన్నారు.