హైదరాబాద్లో 163 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

హైదరాబాద్లో 163 మంది  ఇన్స్పెక్టర్లు బదిలీ

తెలంగాణలో అనధికారికంగా ఎన్నికల వేడి మొదలైంది.  పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. హైద్రాబాద్ లో  163 మంది ఇన్స్పెక్టర్లను   బదిలీ చేశారు సీపీ సీవీ ఆనంద్. నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు.  రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు  రిటర్నింగ్ అధికారులను అపాయింట్ చేశారు. 

బదిలీ అయిన అధికారులు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.