కొనసాగుతున్న మార్కెట్ రికార్డ్ ర్యాలీ

కొనసాగుతున్న మార్కెట్ రికార్డ్ ర్యాలీ

ముంబై: మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డ్ ర్యాలీ కొనసాగుతోంది. బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ  గురువారం 21,801 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ హై నమోదు చేసింది.  గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కదలడంతో పాటు అన్ని సెక్టార్లలో సానుకూలత కనిపించడంతో ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గురువారం  లాభాల్లో క్లోజయ్యాయి. సెన్సెక్స్ 372 పాయింట్లు (0.52 శాతం) పెరిగి 72,410 దగ్గర సెటిలయ్యింది. నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 21,779 దగ్గర ముగిసింది. బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్లో ఓపెన్ అయ్యాయి.  ఇంట్రాడేలో మరింత పెరిగి ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీలో  కోల్ ఇండియా, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీసీ, ఎం అండ్ ఎం, డా.రెడ్డీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోటోకార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు ఎక్కువగా పెరిగాయి. అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐషర్ మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఐమైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రీ, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ, అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ సెక్టార్ మినహా మిగిలిన సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్లోజయ్యాయి. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 2 శాతం వరకు పెరిగాయి. 

ఆజాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

హైదరాబాద్ కంపెనీ ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు 29 శాతం లాభంతో  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.524 అయితే రూ. 710 దగ్గర బోణి చేశాయి.  ఇంట్రాడేలో మరో 10 శాతం పెరిగాయి. చివరికి రూ.677 దగ్గ క్లోజయ్యాయి. ఆజాద్ ఇంజినీరింగ్ మార్కెట్ క్యాప్ రూ.4,002.54 కోట్లకు చేరుకుంది. మొదటి రోజే ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలో 1.51 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. 

ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రై..


ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రై పేరెంట్ కంపెనీ  బ్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్వరలో ఐపీఓకి రానుంది.  ప్రిలిమినరీ పేపర్లను సెబీ వద్ద సబ్మిట్ చేసింది.  ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద  షేర్లను అమ్మనున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,816 కోట్లు సేకరించాలని కంపెనీ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది.  సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2.03 కోట్ల షేర్లను  అమ్మనుంది. మహీంద్రా అండ్ మహీంద్రా, టీపీజీ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న్యూక్వస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏషియా కూడా ఆఫర్ ఫర్ సేల్ కింద  షేర్లను అమ్మనున్నాయి. 2022–23 లో  ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రైకి రూ.5,632.5 కోట్ల రెవెన్యూ, రూ. 486 కోట్ల నష్టం వచ్చింది.