
ఎల్లరెడ్డిపేట, వెలుగు: అక్రమంగా నిల్వచేసిన 40 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ రాహుల్ రెడ్డి వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బీనవేని దేవయ్య వివిధ గ్రామాల నుంచి రేషన్ బియ్యం కొని డంప్ చేశాడు.
సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్, ఎల్లారెడ్డిపేట పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి 40 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. నిందితుడిని స్టేషన్ కు తరలించారు. దేవయ్యపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నటేశ్ పేర్కొన్నారు.