ఫ్యాన్ కు ఉరేసుకుని 12ఏళ్ల బాలుడు మృతి

ఫ్యాన్ కు ఉరేసుకుని 12ఏళ్ల బాలుడు మృతి
  • తల్లిదండ్రులతోపాటు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయిన బాలుడు
  • ఫోన్ తో గేములు ఆడుకుంటూ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయినట్లు అనుమానం
  • పబ్జీ గేములు ఆడేవాడంటున్న తోటి స్నేహితులు

హైదరాబాద్: ఆన్ లైన్ క్లాసులో కూర్చున్న 12 ఏండ్ల చిన్నారి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సంగీత నగర్ కాలనీలో నివాసముంటున్న ఆనంద్, లక్ష్మి దంపతులకు బాల పరుశురాం(18), మణికంఠ(12) ఇద్దరు కొడుకులున్నారు. తండ్రి ఆనంద్ హోండా షోరూంలో పని చేస్తుండగా.. చిన్న కొడుకు మణికంఠ.. రావుస్ స్కూల్లో చదువుతున్నారు.

రోజు వెళ్లినట్టుగానే ఆనంద్, పరుశురాం, తల్లి లక్ష్మి పనికి వెళ్లారు. ఇదిలా ఉండగా.. మణికంఠ శనివారం ఇంట్లో ఆన్ లైన్ క్లాస్ వింటున్నాడు. ఇంతలో ఏం జరిగిందో గాని ఫ్కాన్ హుక్కుకు ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిన ఆనంద్ కు.. మణికంఠ ఇంట్లోని ఫ్యాన్ హుక్కుకు చున్నీతో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే స్థానికుల సహాయంతో రాందేవ్ రావు అసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా మణికంఠకు పబ్జీ గేమ్ అలవాటు ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఆసుపత్రిలో వివరాలు సేకరిస్తున్నారు. కూకట్ పల్లి సీఐ నర్సింగ్ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.