
ఆఫర్ వస్తుందని ఏదైనా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయంది. బిర్యానీ నుంచి బీరువా వరకు.. సెల్ ఫోన్ నుంచి ఇంటి సరుకుల వరకు ఏదైనా ఆర్డర్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆన్ లైన్ మాటున ఉన్న సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా షాకిస్తారో ఆ సిచువేషన్ ఎదురైతేగానే అర్థం కాదు. మంగళవారం (అక్టోబర్ 07) హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరిగిన సైబర్ ఫ్రాడ్ ఆందోళనకు గురిచేస్తోంది.
తక్కువ ధరకు వస్తున్నాయని బిగ్ బాస్కెట్ లో సరుకులు ఆర్డర్ చేసి వ్యక్తి మోసపోయాడు. సరుకులు ఆర్డర్ చేసిన తర్వాత తన ప్రమేయం లేకుండానే లక్షా 97 వేల రూపాయలు మాయం అవ్వడంతో షాకయ్యాడు. ఓటీపీ (OTP) కూడా చెప్పలేదు.. ఎలా క్రెడిట్ కార్డునుంచి డబ్బులు డెబిట్ అయ్యాయా అని పోలీసులను ఆశ్రయించాడు.
WhatsApp ద్వారా పంపిన APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయడంతో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. OTP ఇవ్వకపోయినా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. ఫైల్ ఇన్ స్టాల్ చేయడంతో ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయినట్లు గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.