అఖిలేష్ పాలనలో 700 సార్లు అల్లర్లు జరిగాయి
V6 Velugu Posted on Dec 30, 2021
ఉత్తరప్రదేశ్ ను SP,BSP అభివృద్ధి చేయలేవన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అఖిలేష్ పాలనలో 700 సార్లు అల్లర్లు జరిగాయన్నారు. యోగి పాలనలో ఎవరైనా సరే హింసాత్మక ప్రదర్శనలు చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు పోటీ చేసినా గెలవలేని పరిస్థితి ఉందన్నారు. మాయావతి తొందరగా ప్రచారంలోకి రావాలని అమిత్ షా సూచించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సరిగా ప్రచారం చేయలేదని మాయావతి బుకాయిస్తారని అమిత్ షా ఆరోపించారు. మొరాదాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...
గాంధీని దూషించిన ఆధ్యాత్మిక గురువు అరెస్టు