సంగారెడ్డి డీఈఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

సంగారెడ్డి డీఈఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

సంగారెడ్డి డీఈఓ కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి24న రూ.50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు డీఈఓ రాజేష్. శుక్రవారం 7గంటల పాటు సంగారెడ్డి డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో శనివారం కూడా సోదాలు జరుతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ లోని డీఈఓ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు కూడా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. 

సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ స్కూల్ SSC సిలబస్ నుంచి ICSE కి అప్ గ్రేడ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్ గ్రేడ్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణతో స్కూల్ యాజమాన్యం చర్చలు జరిపింది. స్కూల్ NOC కోసం రూ. లక్షా 10 వేల రూపాయలు డిమాండ్ చేశారు. ముందుగా రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత 60 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక స్కూల్ యాజమాన్యం ACB ని ఆశ్రయించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, DEO రాజేష్ లు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.