ఇస్రో లిస్టులోని రాబోయే ప్రయోగాలు ఇవే.. అన్నీ అద్భుతాలే కదా..

ఇస్రో లిస్టులోని రాబోయే ప్రయోగాలు ఇవే.. అన్నీ అద్భుతాలే కదా..

ఇస్రో తన ప్రయోగం ద్వారా ఇటీవలే చంద్రయాన్ 3ని చంద్రుని దక్షిణ ధృవాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసి సక్సెస్ అయింది. ఈ పరిణామంతో చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇప్పుడు ఇతర మిషన్లపై దృష్టి పెడుతోంది. అందులో భాగంగా భారతదేశం జపాన్‌ సహకారంతో చంద్ర యాత్రను సిద్ధం చేస్తోంది. ఈ యాత్రలో భారతదేశం ల్యాండర్‌ను సరఫరా చేయనుంది. చంద్రయాన్-3 శాస్త్రీయ పరిశోధనలకు అదనంగా జపాన్ ప్రయోగ వాహనం, రోవర్‌ను సరఫరా చేస్తుంది. రోబోటిక్ LUPEX మిషన్ ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం కూడా పరిశోధించబడుతుంది. చంద్రయాన్-3 తర్వాత అంతరిక్షంలో నిర్దేశించని భూభాగాన్ని అన్వేషించాలనే లక్ష్యంతో అంతరిక్ష సంస్థ కాబోయే మిషన్‌ల సుదీర్ఘ జాబితాను కలిగి ఉంది.

తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో.. ఆదిత్య L1 రాకెట్‌ను పంపించేందుకు సిద్దమవుతోంది. దీన్ని సెప్టెంబర్ 2న ఉదయం 11:50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన గొప్ప విషయమేమిటంటే సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే. అంతరిక్ష నౌక భూమి నుంచి 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లగారెంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక కక్ష్యలో ఆదిత్య L1ను  ఇస్రో ప్రవేశపెట్టనుంది. సౌర కార్యకలాపాలను నిరంతరం అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం ప్రయోజనం చేకూర్చనుంది.

NISAR(నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చరు రాడార్) ప్రాజెక్టు

భూమి పర్యావరణ వ్యవస్థలో మార్పులను అర్థం చేసుకునేందుకు ఈ మిషన్ ను ఇస్రో, నాసా కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇది జనవరి 2024లో ప్రారంభం కానుంది. ఈ NISAR అబ్జర్వేటరీ ప్రాజెక్ట్ భూమిని భూమి కక్ష్య నుంచి ప్రతి 12 రోజులకు ఒకసారి మ్యాప్ చేయనుంది. దాదాపు 1.5మిలియన్ డాలర్ల వ్యయంతో ప్రయోగితం కానున్న ఈ మిషన్, "భూమిపై పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, జీవపదార్ధాలు, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు వంటి సహజ ప్రమాదాలలో మార్పులను అర్థం చేసుకోవడం" కోసం సమాచారాన్ని అందించనుంది.

Spadex- మొదటి మానవ సహిత అంతరిక్ష విమానం

స్పేస్ డాకింగ్ మిషన్ అంచనా వ్యయం రూ.124.47 కోట్లు. ఇది 2024 మూడవ త్రైమాసికంలో ప్రారంభించటానికి ప్రణాళిక చేయబడింది.

మంగళయాన్ 2 మిషన్

మంగళయాన్ 2 మిషన్ ను మార్స్ ఆర్బిటర్ మిషన్ 2 అని కూడా పిలుస్తారు. ఇది 2024లో ప్రారంభించటానికి షెడ్యూల్ చేయబడిన రెండవ మార్స్ మిషన్. ఈ ఉపగ్రహంలో "హైపర్‌స్పెక్ట్రల్ కెమెరా, హై-రిజల్యూషన్ పాంక్రోమాటిక్" అమర్చబడి ఉంటుంది. లాంచ్ వెహికల్, స్పేస్‌క్రాఫ్ట్, గ్రౌండ్ సెగ్మెంట్ ఖర్చు రూ. 450 కోట్లు, ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న మిషన్‌లలో ఒకటిగా నిలవనుంది.

గగన్‌యాన్ 1, 2, 3- మొదటి మానవ అంతరిక్ష యాత్ర

గగన్‌యాన్ ప్రాజెక్ట్ మూడు రోజుల మిషన్ కోసం 4వందల కిలోమీటర్ల ఎత్తులో ముగ్గురు వ్యక్తులతో కూడిన సిబ్బందిని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. గగన్‌యాన్ 3 భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష యాత్ర. ఈ మిషన్ ప్రయోగాన్ని 2024లో చేసేందుకు ప్లాన్ చేశారు. హిందూ మహాసముద్రంలో ల్యాండింగ్‌తో సిబ్బంది సురక్షితంగా తిరిగి రావడం దీని ప్రాథమిక లక్ష్యం.