ఆకాశ్ స్కాలర్ షిప్ టెస్ట్.. ఐదుగురికి నాసా సందర్శించే అవకాశం

ఆకాశ్ స్కాలర్ షిప్ టెస్ట్.. ఐదుగురికి నాసా సందర్శించే అవకాశం
  • 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఛాన్స్

విజయవాడ: డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని లక్ష్యంగా పెట్టుకున్న 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు నీట్‌, ఐఐటీ-జెఈఈ కోచింగ్‌ పొందేందుకు ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎఈఎస్‌ఎల్) ప్రతిష్ఠాత్మక వార్షిక స్కాలర్‌షిప్‌ పరీక్ష ఆకాశ్‌ నేషనల్‌ టాలెంట్ హంట్‌ ఎగ్జామ్‌ (ఎఎన్‌టీహెచ్‌ఈ) 2021, పన్నెండవ ఎడిషన్‌  ద్వారా 100 శాతం వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. అలాగే అన్ని గ్రేడుల్లో ఐదుగురు విద్యార్థులకు తల్లిదండ్రుల్లో ఒకరితో కలసి ఉచితంగా నాసా సందర్శించే అవకాశం కల్పించింది. ఈ జాతీయ స్కాలర్ షిప్ పరీక్ష -ఎఎన్‌టీహెచ్‌ఈ, వచ్చే డిసెంబర్‌ నెల 4 నుంచి 12వ తేదీల మధ్యన ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధానాల్లో దేశ వ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించనుంది. 2010 నుంచి ఎఎన్‌టీహెచ్‌ఈ ద్వారా స్కాలర్ షిప్ పరీక్షలు నిర్వహిస్తున్న ఆకాశ్ ఇప్పటి వరకు 23 లక్షలకు పైగా విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందించింది.
ట్యూషన్‌ ఫీజుపై స్కాలర్‌షిప్‌తో పాటు అత్యుత్తమ స్కోర్‌ చేసిన వారికి నగదు బహుమతులు కూడా ప్రదానం చేస్తామని సంస్థ ప్రకటించింది. ఎఎన్‌టీహెచ్‌ఈలో అర్హత సాధించే విద్యార్థులు అదనంగా మెరిట్‌ నేషన్ స్కూల్‌ బూస్టర్‌ కోర్సు ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. 
ఈ పరీక్షకు మొత్తం మార్కులు 90. ఇందులో విద్యార్థుల తరగతి, వారు కోరుకుంటున్న  స్ట్రీమ్‌కు సంబంధించి 35 మల్టీపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 7-9వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమ్యాటిక్స్, మెంటల్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మెడిసిల్‌లో చేరాలనుకునే X విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ,  మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అదే ఇంజినీరింగ్‌ వైపు ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమ్యాటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అలాగే నీట్‌ను లక్ష్యంగా చేసుకున్న XI-XII విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జూవాలజీ నుంచి, ఇంజినీరింగ్‌ ఆశావహులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమ్యాటిక్స్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష రాయాలనుకునే వారు ఆన్‌లైన్‌లో అయితే పరీక్ష తేదీకి 3 రోజుల ముందు వరకు, ఆఫ్‌లైన్‌లో అయితే పరీక్ష తేదీకి 7 రోజుల ముందు వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.99. దీనిని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు లేదా మీ సమీపంలోని ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌ కేంద్రంలో నేరుగా చెల్లించవచ్చు. 10 మరియు ఇంటర్ విద్యార్థుల ఫలితాలు జనవరి 2న, 9వ తరగతి విద్యార్థుల ఫలితాలు జనవరి 4న ప్రకటిస్తామని ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎఈఎస్‌ఎల్) ఎండీ ఆకాశ్‌ చౌదరి తెలిపారు. డాక్టర్లు, ఐఐటీయన్లు కావాలనే కలలను సాకారం చేస్తుంది కాబట్టే ఎఎన్‌టీహెచ్‌ఈ ఏటా విద్యార్థుల నుంచి సహజంగానే అనూహ్యమైన స్పందనను, తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు అందుకుంటోందన్నారు. మరిన్ని వివరాలకు.. For more details, please log in to https://anthe.aakash.ac.in/anthe