
ముంబై: ఈసారి అక్షయ తృతీయకు బంగారం అమ్మకాలు పెద్దగా ఉండకపోవచ్చని గోల్డ్ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తున్న టైములో గోల్డ్ కొనడానికి కస్టమర్లు ముందుకు రాకపోవచ్చని ఆందోళన చెందుతోంది. అక్షయ తృతీయ కిందటేడాది లాక్డౌన్ టైములు అంటే ఏప్రిల్ 26న వచ్చింది. ఈ ఏడాది మే 14న వస్తుంది. చాలా రాష్ట్రాలలో లాక్డౌన్లు, రెస్ట్రిక్షన్లు అమలవుతున్నాయి. దీంతో సేల్స్ దెబ్బతింటాయని భావిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి బంగారం కొనడానికి ఇష్టపడతారని తామనుకోవడం లేదని ఇండియన్ బులియన్ అండ్ జ్యుయెలరీ అసోసియేషన్ సెక్రటరీ సురేంద్ర మెహతా చెప్పారు.కొనాలనుకునే కస్టమర్లు గోల్డ్ షాపు ఓనర్లకు ఫోన్ చేసి, ఇంటికే రప్పించుకోవాలని రికమెండ్ చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద జ్యుయెలర్లు అందరూ డిజిటల్ గోల్డ్ కొనాలని ఎంకరేజ్ చేస్తున్నారని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పేర్కొంది.