పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రేట్లు

పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రేట్లు

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రేట్లు పెంచింది. సవరించిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో యూజర్లకు భారం మరింత పెరగనుంది. కొత్త ధరల ప్రకారం అమెజాన్ ప్రైమ్ నెలవారీ సబ్ స్క్రిప్షన్ గతంలో రూ. 129 ఉండగా.. ప్రస్తుతం 38శాతం పెరిగి రూ.179కి చేరింది. 3 నెలల సబ్ స్క్రిప్షన్ రేటు రూ.329 నుంచి రూ.459కి, యాన్యువల్ సబ్ స్క్రిప్షన్ రూ.999 నుంచి ఏకంగా 50శాతం పెంపుతో రూ.1,499కి పెరిగింది. 
లాస్ట్ ఛాన్స్ టూ జాయిన్ ప్రైమ్ పేరుతో అమెజాన్ డిసెంబర్ 13 కన్నా ముందు ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ ను రూ.999కే కొత్త యూజర్లుతో పాటు ఇప్పటికే సబ్ స్క్రైబ్ చేసుకున్న వారు రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. తాజాగా రేట్లు పెంచినప్పటికీ ఎంపిక చేసిన యూజర్లకు డిస్కౌంట్ తో ప్యాకేజీ అందించనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక భారం పెరుగుతున్నందునే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని అమెజాన్ ప్రకటించింది. ఐదేళ్ల క్రితం భారత్ లో అడుగుపెట్టిన ఈ సంస్థ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ తో పాటు ఓటీటీ నెట్ ఫ్లిక్స్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది.