కడెం మండల వాసికి అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డ్

కడెం మండల వాసికి అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డ్

కడెం, వెలుగు: కడెం మండలం పెద్ద బెల్లాల్ కు చెందిన సామాజిక సేవకుడు కొత్తపల్లి రాజేశ్వర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజేశ్వర్ చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన మెక్సికోలోని టొలాస యూనివర్సిటీ.. ఈ అవార్డును మహారాష్ట్రలోని షోలాపూర్​లో ప్రదానం చేసింది.

 కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ కట్ట బొమ్మన, జాన్ మాస్టర్, సోనియా, ఇంటర్నేషనల్ మలేషియా ఫౌండర్ డాక్టర్ కేఏ జనార్దన్ చేతుల మీదుగా రాజేశ్వర్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ కాయితీ శంకర్, మెట్టు దాసు, అంగడి ఆనంద్ పాల్గొన్నారు