తెలంగాణ ఎంసెట్ లో ఆంధ్రోళ్ల హవా..టాప్ 10లో 8 ర్యాంకులు వాళ్లకే

తెలంగాణ ఎంసెట్ లో ఆంధ్రోళ్ల హవా..టాప్ 10లో 8 ర్యాంకులు వాళ్లకే

 తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రోళ్ల హవా కొనసాగింది. తొలి పది ర్యాంకుల్లో ఎనిమిదింటిని ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టీఎస్ ఎంసెట్ ఫలితాలను ఇవాళ ఉన్నత విద్యామండలి చైర్మన్ రిక్క లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో కలిసి  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాసబ్ ట్యాంకులోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియంలో విడుదల చేశారు. టాప్ టెన్ ర్యాంకుల్లో  ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు హవా కొనసాగింది. అగ్రికల్చర్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ లలో  టాపర్లుగా వాళ్లే ఉన్నారు. ఇంజినీరింగ్ లో టాప్ 10లో   ఇద్దరే తెలంగాణ వాళ్ళు ఉండగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ టాప్ టెన్ లో ముగ్గురు తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం అగ్రికల్చర్ లో 91,935మంది ( 86% మంది ), ఇంజనీరింగ్ లో 1,56,879 మంది(80%) క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం క్వాలిఫై అయ్యారు.  ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.inలో చూడవచ్చు. అడ్మిషన్‌ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదలచేస్తామని మంత్రి సబితారెడ్డి చెప్పారు.  85% సీట్లను తెలంగాణకు చెందిన వారికి, 15% ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కేటాయిస్తామని తెలిపారు. 

 ఇంజినీరింగ్‌ టాపర్లు..

1. సనపల అనిరుధ్‌ (విశాఖపట్నం)
2. ఎక్కంటిపాని వెంకట మణిందర్‌ రెడ్డి (గుంటూరు)
3. చల్లా ఉమేశ్‌ వరుణ్‌ (నందిగామ)
4. అభినీత్‌ మాజేటి (కొండాపూర్‌,హైదరాబాద్)
5. పొన్నతోట ప్రమోద్‌కుమార్‌రెడ్డి (తాడిపత్రి,అనంతపూర్)
6. మారదన ధీరజ్ ( విశాఖ పట్టణం)
7. వడ్డే శాన్విత (నల్లగొండ)
8. బోయిన సంజన (శ్రీకాకుళం)
9. ప్రిన్స్ బ్రనహం రెడ్డి (నంద్యాల)
10. మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం)

అగ్రికల్చర్‌&ఫార్మా టాపర్లు..

1. బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్‌ (తూర్పుగోదావరి జిల్లా)
2. నశిక వెంకటతేజ (చీరాల,ప్రకాశం)
3. సఫల్‌లక్ష్మి పసుపులేటి (సరూర్‌నగర్‌,రంగారెడ్డి)
4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి,గుంటూరు)
5. బోర వరుణ్‌ చక్రవర్తి (శ్రీకాకుళం)