
వెలుగు, నెట్వర్క్ : హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మర్వాడీ వ్యతిరేక ఉద్యమం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాకింది. తెలంగాణ రాష్ట్ర బంద్ కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు నిరసన తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా కేంద్రాల్లో అన్ని మొబైల్ దుకాణాలతోపాటు శానిటరీ, ఎలక్ట్రికల్, కిరాణ అసోసియేషన్, ఎలక్ట్రికల్స్, హార్డ్‌వేర్ అసోసియేషన్, వస్త్ర దుకాణాలు, స్టీల్, సిమెంట్ అసోసియేషన్, స్వర్ణకారులు, రెడీమేడ్ దుకాణాలు, అన్ని వ్యాపార సముదాయాలను స్వచ్ఛదంగా మూసివేశారు.
మార్వాడీలు నకిలీ వస్తువులను తీసుకొచ్చి ప్రజలను మోసం చేయడమే కాకుండా, నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని స్థానిక వ్యాపారులు ఆరోపించారు. తెలంగాణ బచావో.. మార్వాడీ హఠావో, మార్వాడీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.