
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో సెప్టెంబర్ 19వ తేదీన విచారణ జరగనుంది. తన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.
తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దీంతో సెప్టెంబర్ 18వ తేదీ వరకు కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. ఆ గడువు పూర్తి కావడంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో తదుపరి విచారణ చేపట్టనుంది.
ALSO READ: వారిద్దరూ కలిసినా వచ్చేది సున్నానే: మంత్రి అంబటి
దీంతో పాటు.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగే అవకాశముంది.