ఆర్యన్ ఖాన్‌ కేసులో బాంబే హైకోర్టు తీర్పు

ఆర్యన్ ఖాన్‌ కేసులో బాంబే హైకోర్టు తీర్పు

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. ఈ కేసులో ఆర్యన్‌తోపాటు అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా, ఈ కేసు గురించి ఇవ్వాళ బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్యన్ ఖాన్ క్రమం తప్పకుండా డ్రగ్స్ తీసుకునే వాడని అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టుకు తెలిపారు. గత కొన్నేళ్లుగా అతడు డ్రగ్స్ తీసుకుంటున్నాడని అనిల్ వాదించారు. ఆర్యన్ దగ్గర పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో తరఫున వాదిస్తున్న అనిల్ అన్నారు. నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రొపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) యాక్ట్ ప్రకారం డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయిన వారికి బెయిల్ ఇవ్వాలన్న రూల్ ఏమీ లేదని.. కానీ అదో మినహాయింపని ఆయన చెప్పారు. 

కాగా, ఈ కేసులో ఆర్యన్‌తోపాటు అరెస్ట్ వారిలో ఒకడైన  అర్బాజ్ మర్చంట్ తన వద్ద చరాస్ (గంజాయితో చేసిన పదార్థం) ఉందనే విషయాన్ని అంగకీరించాడు. ఇకపోతే, ఆర్యన్ ఖాన్ మూడు వారాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు. బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు అతడు పిటిషన్లు పెట్టుకున్నప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీంతో అతడి తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్యన్ ఖాన్ తరఫున సతీష్ మాన్‌షిండే, అమిత్ దేశాయ్‌‌తోపాటు ప్రముఖ న్యాయవాది, మాజీ ఏజీ ముకుల్ రోహిత్గీ కూడా వాదించారు. ఆర్యన్ విడుదల గురించి ముకుల్ రోహిత్గీ స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులు విడుదలైన వెంటనే ఆర్యన్, అర్బాజ్, మున్మున్ ధమేచాలు జైలు నుంచి రిలీజ్ అవుతారని అన్నారు. ఇది తనకు ఓ మామూలు కేసు లాంటిదేనన్న ఆయన.. కేసుల్లో గెలుపోటములు సహజమన్నారు. ఆర్యన్‌కు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

ఒకే స్కూల్‌లో 32 మంది విద్యార్థులకు కరోనా

ఒక్క మ్యాచ్.. ఎన్నో కేసులు, అరెస్టులు.. మరెన్నో వివాదాలు

టీటీడీ బోర్డులోని 18 మందికి హైకోర్టు నోటీసులు