
కొడగు: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లు, కాలేజీలకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాయి. కొవిడ్ రూల్స్ పాటిస్తూ క్లాసులు జరుపుకోవాలని స్కూళ్లు, కళాశాలలకు ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో చాలా వరకు విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఓపెన్ అయిన ఓ పాఠశాలలో 32 మంది కరోనా బారినపడ్డారు. కర్నాటకలోని కొడగు జిల్లా మడికెరిలోని జవహార్ నవోదయ విద్యాలయలో చదువుకుంటున్న 22 మంది బాలురు, 10 మంది బాలికలకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ స్కూల్‌లో మొత్తం 270 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరికి వారం కింద కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్‌గా తేలిన వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు కరోనా సోకడంపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ పంకజాషన్ స్పందించారు. స్టూడెంట్స్ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం క్యాంపస్‌ను శానిటైజ్ చేశామన్నారు.