
కనుచూపుమేరంతా పచ్చదనం, కొండల మీది నుంచి జాలువారే జలపాతాలు, గలగల పారే సెలయేళ్లు, నదులు, అరుదైన పక్షి, జంతుజాతులకు కేరాఫ్ ఆసిఫాబాద్ అడవులు. ప్రకృ-తి రమణీయతకు నెలవైన ఈ అడవిలో 285 రకాల పక్షి జాతులు ఉన్నట్లు ఇప్పటికే తేలింది. అలాగే పెంచికల్‌పేట మండలం కొండపల్లి దగ్గర అరుదైన వృక్ష శిలాజాలు బయటపడ్డాయి.
ఈ క్రమంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులు, అందులోని ప్రత్యేకతలను బయటి ప్రపంచానికి తెలియజేప్పేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నేచర్ లవర్స్ అడవిలో పర్యటించేలా బర్డ్ వాక్ ఫెస్ట్ పేరిట పక్షులు, జంతువులు, వన్య మృగాలను కెమెరాల్లో బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. - ఆసిఫాబాద్, వెలుగు