
ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చదువు చాలా ముఖ్యం. దాదాపు 90 శాతం మంది ప్రైవేట్ విద్య వైపు మొగ్గు చేపుతారు. అయితే ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలంటే చదువుకొనాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అస్సాంలోని ఓ పాఠశాల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ స్కూల్లో చదివే విద్యార్థులు ఫీజు చెల్లించరు. కాని ప్రతినెల 100 ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్ స్కూల్లో ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది.
నేటి కాలంలో పిల్లలకు మంచి విద్యను అందించాలంటే తల్లిదండ్రులు ముందుగా పొదుపు చేయాలి. చాలా పాఠశాలల్లో ఫీజులు లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నారు. అయితే గౌహతి అక్షర్ ఫోరమ్ స్కూలు పిల్లలు వారు కట్టే ఫీజును విద్యార్థులే కట్టే విధంగా పాఠశాల యాజమన్యం నిర్ణయం తీసుకుంది. ఈ స్కూల్లో చదివే పిల్లలు డబ్బులకు బదులుగా నెలకు 100 ప్లాస్టిక్ బాటిల్స్ ఇవ్వాలి. గౌహతి అక్షర్ ఫోరమ్ స్కూల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు చదువుతుంటారు. ఈ స్కూల్లో పిల్లలు ప్రతి వారం ఇరవై ఐదు ఖాళీ వాటర్ బాటిళ్లను సేకరిస్తారు. ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని స్కూలు యాజమాన్యానికి ఆలోచన వచ్చి్ంది. దీంతో వెంటనే విద్యార్థులను ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించమని వాటి ద్వారా వచ్చిన డబ్బును పిల్లల ఫీజు కింద జమ చేసుకుంటారు.