రెండో టెస్ట్‌‌లో విజయం దిశగా ఆసీస్‌‌ ..

రెండో టెస్ట్‌‌లో విజయం దిశగా ఆసీస్‌‌ ..

బ్రిస్బేన్‌‌: వెస్టిండీస్‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో ఆస్ట్రేలియా విజయానికి 156 రన్స్‌‌ దూరంలో నిలిచింది. చేతిలో మరో 8 వికెట్లున్నాయి. విండీస్‌‌ నిర్దేశించిన 216 రన్స్‌‌ లక్ష్యాన్ని ఛేదించేందుకు మూడో రోజు శనివారం బరిలోకి దిగిన ఆసీస్‌‌ ఆట ముగిసే టైమ్‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌లో 19 ఓవర్లలో 60/2 స్కోరు చేసింది. స్టీవ్‌‌ స్మిత్‌‌ (33 బ్యాటింగ్‌‌), కామెరూన్‌‌ గ్రీన్‌‌ (9 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ఉస్మాన్‌‌ ఖవాజ (10), లబుషేన్‌‌ (5) ఫెయిలయ్యారు. 

అంతకుముందు 13/1 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన విండీస్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 72.3 ఓవర్లలో 193 రన్స్‌‌కు ఆలౌటైంది. మెకంజీ (41) టాప్‌‌ స్కోరర్‌‌.