కేరళలో మరో మూడు జికా వైరస్ కేసులు కలకలం

కేరళలో మరో మూడు జికా వైరస్ కేసులు కలకలం

కేరళలో మరో మూడు జికా వైరస్ కేసులను నిర్ధారించారు అధికారులు. దీంతో కేరళలో మొత్తం జికా కేసుల సంఖ్య 18కి పెరిగింది. కొత్తగా జికా వైరస్ బారిన పడ్డ ముగ్గురిలో 22 నెలల చిన్నారి కూడా ఉంది. తిరువనంతపురంతో పాటు త్రిస్సూర్, కోజికోడ్ మెడికల్ కాలేజీల్లో టెస్టింగ్ ఫెసిలిటీస్ కల్పించినట్లు చెప్పారు కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్. అలప్పుజాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోనూ సదుపాయాలు కల్పించామని చెప్పారు. పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి 2 వేల ఒక వంద  టెస్టింగ్ కిట్స్ కూడా వచ్చాయని చెప్పారు. వీటిలో వెయ్యి తిరువనంతపురం, 500 అళప్పుజ, త్రిస్సూర్, కోజికోడ్ కు చెరో 3 వందల కిట్స్ పంపినట్లు చెప్పారు. జికా వైరస్ విషయంలో కేరళ అప్రమత్తమైంది. కేంద్రం కూడా ఆరుగురు నిపుణుల బృందాన్ని శుక్రవారం కేరళకు పంపింది. ఇక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు సరిహద్దు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి.