
కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ సోషల్ మీడియా/ఆన్‌లైన్‌లోనే ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెట్టడం, వేరే పోస్ట్‌లకు రెస్పాండ్ అవ్వడం చేస్తుంటారు. ఇలా సోషల్ మీడియా ఎక్కువగా వాడేవాళ్లు కొన్నిరకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు సైకాలజిస్ట్‌లు చెప్తున్నారు. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోవాలని వాళ్లు హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా కూడా సోషల్ మీడియా వినియోగం పెరిగింది. దీంతో చాలామంది దీనికి అడిక్ట్ అవుతున్నారు. వీలున్నంత తక్కువ టైమ్ మాత్రమే సోషల్ మీడియా వాడుతూ, ఇతర పనులకోసం మిగతా టైం స్పెండ్ చేయగలిగితే, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండొచ్చంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఈ విషయంలో వాళ్లు అందిస్తున్న కొన్ని సూచనలివి. స్క్రీన్ డివైజ్‌పై ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. దీనికోసం కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించి, ఫోన్ వాడే టైమ్ మెల్లగా తగ్గించుకోవాలి.
టైమ్ లిమిట్ పెట్టుకుని సోషల్ మీడియా వాడటం అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్‌గా కలిసే వాళ్లతో ఆన్‌లైన్ చాటింగ్ తగ్గించాలి. డైరెక్ట్‌గా ఫేస్–టు–ఫేస్ మాట్లాడితే, ఆ తర్వాత చాట్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. నాన్–స్క్రీన్, ఔట్‌డోర్ యాక్టివిటీస్ అలవాటు చేసుకోవడం ఒక మంచి సొల్యూషన్. వాకింగ్ చేయడం, పుస్తకాలు చదవడం, ఏదైనా గేమ్ ఆడటం వంటివి అలవాటు చేసుకుని వాటిపై ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. అన్నింటికీ మించి సోషల్ మీడియాను వదలలేనంతగా అలవాటుపడితే మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి. డైలీ మెడిటేషన్, యోగా వంటివి ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఈ అలవాటును మానలేకపోతే సైకాలజిస్ట్‌లను సంప్రదించాలి.