బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజవకర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల రవి అన్నారు. సోమవారం బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే 22 నెలల్లో కోట్లాది రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. బీఆర్ఎస్పార్టీకి కాలం చెల్లిందని, అందుకే ఆ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కు చెందిన ఓ చోటా నాయకుడు తన హోదాను మరిచి, ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. బెల్లంపల్లి ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఐటీసీ మంజూరు చేయించారన్నారు. సింగరేణి యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూడం మహేశ్, మైదం రమేశ్, గోలేటి స్వామి, మారపాక వంశీ, బండి రాము, కన్నూరి రాజలింగు తదితరులు పాల్గొన్నారు.
