బెంగుళూరులో నాలుగు అంతస్తుల భవనం కూల్చివేత

బెంగుళూరులో నాలుగు అంతస్తుల భవనం కూల్చివేత

కర్ణాటకలోని బెంగుళూరులో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. లేటెస్టుగా  మరో భవనాన్ని  ఇవాళ(బుధవారం) కూల్చివేశారు. పశ్చిమ బెంగళూరు కమలా నగర్‌లోని నాలుగు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌.. నిన్న(మంగళవారం) రాత్రి పాక్షికంగా ఒరిగింది.అది కూలేందుకు సిద్ధంగా ఉండటంతో అందులో ఉండే వారిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. సమీపంలోని ఇండ్లలో ఉండే వారిని కూడా మరో ప్రాంతానికి  తరలించారు. వారికి వసతి, ఆహారం ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం అధికారులు జేసీబీ సహాయంలో ఆ బిల్డింగ్‌ను పూర్తిగా కూల్చివేశారు.ఎలాంటి ప్రాణ హాని జరగకుండా అగ్నిమాపక, అత్యవసర సేవా అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారు. 

భారీ వర్షం కారణంగా ఆ భవనం కాస్త వంపుకు తిరిగింది. ఇలాంటివే నగరంలో ఉండటంతో బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ శిథిలావస్థ భవనాల జాబితా తయారు చేసింది. 26 భవనాలతో లిస్టు తయారు చేసింది. అందులో కమలానగర్‌లోని భవనం ఒకటి. ఈ భవనంలో ఉన్న ఎనిమిది కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు.