భూఆక్రమణదారులతో ఈవో చర్చలు

భూఆక్రమణదారులతో ఈవో చర్చలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ఏపీలోని ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న భూములను ఆక్రమించిన రైతులతో ఆలయ ఈవో దామోదర్​రావు సోమవారం చర్చలు జరిపారు. వ్యవసాయం చేసుకునే సమయంలో ఎలాంటి అటంకం కలిగించమని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న ఆక్యుపేషన్​ చార్జీలు చెల్లించాలని రైతులకు సూచించారు. ఈవో ప్రతిపాదనకు అంగీకరించిన రైతులు అక్కడికక్కడే ఆక్యుపేషన్​ చార్జీలు కట్టారు.

గతంలో ఉన్న ఈవోలు తమతో ఇలా మాట్లాడలేదని, పంటలకు నష్టం చేశారని రైతులు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఈవోను రైతులు సత్కరించారు. పురుషోత్తపట్నంలో వెయ్యి ఎకరాలు భద్రాచలం సీతారామచంద్రస్వామికి సంబంధించిన భూములు ఉన్నాయి. ఇవన్నీ రైతుల ఆక్రమణలోనే ఉన్నాయి. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రైతులు దేవస్థానానికి సహకరించాలని ఈవో సూచించారు.