సోయా కొనుగోలు కేంద్రాలు పెట్టాలి : భారతీయ కిసాన్ సంఘ్

సోయా కొనుగోలు కేంద్రాలు పెట్టాలి : భారతీయ కిసాన్ సంఘ్
  • భారతీయ కిసాన్ సంఘ్ విజ్ఞప్తి
  • బాసర టెంపుల్ నుంచి భైంసాకు రైతుల పాదయాత్ర 

బాసర, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, సోయా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కోరింది. మంగళవారం నిర్మల్​జిల్లా బాసర ఆలయం నుంచి భైంసా వరకు పాదయాత్రను చేపట్టారు. ముందుగా కిసాన్ సంఘ్​సభ్యులు అమ్మవారిని దర్శించుకుని పాదయాత్ర మొదలుపెట్టారు. 

సోయా పంట చేతికి వచ్చినా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముథోల్ పశుపతి నాథ్​ శివాలయంలో బసచేసి బుధవారం ఉదయం భైంసా సబ్ కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేసి, అనంతరం  వినతి పత్రం అందిస్తామని కిసాన్ సంఘ్ సభ్యులు తెలిపారు.