అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి : జాన్సన్ నాయక్

అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి : జాన్సన్ నాయక్

ఖానాపూర్, వెలుగు: సీఎం కేసీఆర్ నేతృత్వంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషిచేస్తోందని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి  భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని గిన్నె రా, బిక్కు తండా, ధర్మసాగర్, మల్లాపూర్, దేవాపూర్, ఇంకరగూడ తదితర గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉంటూ వారికి గుణపాఠం చెప్పాలన్నారు. గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీఆర్ఎస్ హయాంలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. 

ఇంద్రవెల్లి మండలం బిక్కుతండాకు చెందిన పలువురు నేతలు జాన్సన్ నాయక్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన జాన్సన్ కు ఆదివాసీ గిరిజనులు ఘ న స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో అదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఉట్నూర్ జడ్పీటీసీ రాథోడ్ చారులతతో పాటు పార్టీ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

మైనార్టీ నాయకుల ప్రచారం

జాన్సన్ నాయక్ కు మద్దతుగా ఖానాపూర్ కు చెందిన పలువురు మైనార్టీ నాయకులు పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం  నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. ఇందులో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖాలీల్, నాయకులు డాక్టర్ కేహెచ్ ఖాన్, మెహరాజ్ ఉద్దీన్, షోయబ్, నసీర్, వాహబ్, ఇర్ఫాన్, గఫర్, రషీద్, రహీమ్ పాల్గొన్నారు.