
న్యూఢిల్లీ: ఐపీఎల్ మీడియా రైట్స్ విషయంలో బీసీసీఐకి షాక్. రిలయన్స్ (వయకామ్ 18)కు గట్టిపోటీ ఇస్తుందనుకున్న అమెజాన్, గూగుల్ బిడ్డింగ్ నుంచి వైదొలిగాయి. ఈ రెండు కంపెనీలు టెక్నికల్ బిడ్డింగ్‌ను దాఖలు చేయలేదు. దీనికి ఎలాంటి కారణాలు కూడా వెల్లడించలేదు. ఈ రెండు కంపెనీలు పోటీ నుంచి తప్పుకోవడంతో రిలయన్స్, స్టార్, సోనీ, జీ మధ్య పోటీ నెలకొంది. అయితే టీవీ, డిజిటల్ స్పేస్‌లో రిలయన్స్ గట్టిపోటీదారుగా నిలబడే చాన్స్ కనిపిస్తోంది. ‘అమెజాన్ రేస్ నుంచి తప్పుకుంది. ఈ రోజు జరిగిన టెక్నికల్ బిడ్డింగ్ ప్రాసెస్‌లో అమెజాన్ పాల్గొనలేదు. బిడ్ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేసిన గూగుల్ కూడా ఈ ప్రాసెస్‌కు దూరంగా ఉంది. ప్రస్తుతానికి 10 కంపెనీలు రేస్‌లో ఉన్నాయి’ అని బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించాడు.