విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రెంటల్ బైకులు, కార్లు

విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రెంటల్ బైకులు, కార్లు

విశాఖపట్టణం: జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడాలని కోరుకునే యాత్రికులు ఇతర ప్రయాణికులకు శుభవార్త. విశాఖ పరిసరాల్లోని పర్యాటక ప్రాంతాలను  బైకులు, కార్లలో తిరిగి సందర్శించాలనుకునే వారి కోరికను మన్నించే రీతిలో విశాఖపట్టణం రైల్వే స్టేషన్ ప్రాంగణం నుంచి అద్దెకు బైకులు, కార్లు తీసుకుని వెళ్లి చూసొచ్చే అవకాశం అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అందమైన సముద్ర తీరంతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుపొందిన విశాఖ రైలు ప్రయాణికుల కోసం విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సేవలను శనివారం వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి లాంఛనంగా ప్రారంభించారు.
 ప్రయోగాత్మక రీతిలో పర్యావరణ పరిరక్షణ కోసం  ఎలక్ట్రిక్ బైకులు అందుబుటలో ఉంచామని ఈ సందర్భంగా రైల్వే డీఆర్ఎం అనూప్ కుమార్ వెల్లడించారు. అద్దె ప్రాతిపదికన వాహనాలు తీసుకుని విశాఖ పరిసరాలను చూసి తిరిగిరావొచ్చని ఆయన తెలిపారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు విశాఖ పరిసరాల్లోని అందాలను తనివితీరా చూసి సంతృప్తిగా తిరిగి వెళ్లేందుకు అ అవకాశం దోహదం చేస్తుందని భావిస్తున్నామన్నారు.