లోకల్​పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నరు

లోకల్​పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నరు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, మునుగోడు బై ఎలక్షన్​ స్వేచ్ఛగా జరిగేలా చూడాలని ఆ పార్టీ నేతలు రాష్ట్ర సీఈవో వికాస్​ రాజ్​ను కోరారు. మంగళవారం బీజేపీ నాయకుడు ఇంద్రసేనా రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు వికాస్​రాజ్​ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్​ బై ఎలక్షన్​ సందర్భంగా కేంద్ర బలగాలు పంపినట్లే మునుగోడుకు పంపాలని, ప్రత్యేక పోలీసు అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర పోలీసులు పక్షపాతం ప్రదర్శిస్తున్నారని, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. సీఐ అంతకంటే తక్కువ ర్యాంకు ఉన్న పోలీసు ఆఫీసర్లంతా బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. షెడ్యూల్​ రాక ముందు నుంచే నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని, వెహికల్​ చెకింగ్​లో భాగంగా అంబులెన్స్ లను చెక్ చేయాలన్నారు. కొత్త ఓటర్లలను ఇప్పుడు నమోదు చేసుకోవద్దని కోరారు. 8న ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తామని సీఈవో చెప్పినట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు.