నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి : మహేశ్వర్ రెడ్డి

నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి : మహేశ్వర్ రెడ్డి
  • బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి 

నర్సాపూర్ జి, వెలుగు: భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం అందజేయాలని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్​చేశారు. బుధవారం నర్సాపూర్ జి మండలంలో పర్యటించి భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, రహదారులను పరిశీలించారు. దేవుడు చెరువుకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా నిర్మల్ నియోజకవర్గంలో భారీగా నష్టం జరిగిందన్నారు. 

అనేక చెరువులు, కుంటలు తెగిపోయాయని,  వరదల కారణంగాపంట పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లురప్పలు చేరి రైతులు భారీగా నష్టపోయారని, మత్సకారులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని, ఇండ్లు కూలిపోయిన వారికి తక్షణమే ఆర్థిక సాయం చేయాలని డిమాండ్​చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు శనిగరపు చిన్నయ్య, ముత్యం రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు నరేందర్, నాయకులు దత్తురాం, సుధాకర్, గంగారం, శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ పటేల్, మహిపాల్, సాయన్న, భోజన్న తదితరులు పాల్గొన్నారు.