లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. లక్ష్మణచాంద మండలంలోని పార్పెల్లి, మామడ మండలం బండల ఖానాపూర్, కమల్ కోట్ గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శనివారం భూమిపూజ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, లక్ష్మణచాంద, మామడ మండలాల అధ్యక్షులు చిన్నయ్య, రంజిత్, నాయకులు రాజు, రమణారెడ్డి, బాపురెడ్డి, రమేశ్, ముత్యం రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
