
సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 వ తేది ఆదివారం రాత్రి సమయంలో సంభవించనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారడం వలన ఆకాశం ఎర్రగా కనపడుతుంది. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రపంచ జనాభాలో 85 శాతం మందికి అంటే 700 కోట్ల మందికి ఈ దృశ్యం కనిపిస్తుంది. చంద్రగ్రహణం రోజున చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ఉంటారు.
ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సెప్టెంబర్ 7 వ తేది రాత్రి సమయంలో 82 నిమిషాల పాటు అంటే.. 3 గంటల 29 నిమిషాల 24 సెకన్ల పాటు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం సమయంలో, చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు మొదట చీకటిగా మారుతుంది, ఇది పాక్షిక దశను సూచిస్తుంది. తరువాత రేలీ స్కాటరింగ్ కారణంగా చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు . సూర్యుని కాంతి .. భూమిపై పడినప్పుడు .. ఆ సమయంలో చంద్రుడికి.. సూర్యుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు.
చంద్రుడికి పూర్తిగా అడ్డు వస్తే.. సంపూర్ణ చంద్రగ్రహణం.. కొద్దిగా అడ్డుగా ఉంటే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆదివారం ( సెప్టెంబర్7) సంపూర్ణ చంద్రగ్రహణం కావున చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. తరువాత క్రమంగా మళ్ళీ ప్రకాశిస్తుంది. అయితే సూర్యుడు.. చంద్రుడు.. భూమి కదలికలను బట్టి ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందుచేస్తుంది.
సంపూర్ణ చంద్ర గ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా ఎర్రగా ఉన్న దృశ్యం భారతదేశం అంతటా కనిపిస్తుంది. ఆసియా, తూర్పు ఆఫ్రికా , ఆస్ట్రేలియా అంతటా కనిపిస్తుంది. ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాలు, యూరప్‌లోని చాలా ప్రాంతాలు, బ్రెజిల్ తూర్పు తీరంలోని ప్రజలకు పాక్షికంగా కనిస్తుంది. 700 కోట్లమంది (7 బిలియన్ల ) చంద్రగహణాన్ని వీక్షించేందుకు అవకాశం ఉందని ఖగోళ శాస్త్రేవేత్తలు చెబుతున్నారు.