బోధన్, వెలుగు: ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు జీవన భృతిని కల్పించాలని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి.మల్లేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బోధన్ పట్టణంలోని తట్టికోట్‌లో బీడీ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా లేబర్ కోడ్‌లు రూపొందించారని విమర్శించారు. బీడి కార్మికులకు రూ.9 వేల ఫించన్ ఇవ్వాలని, పీఎఫ్ లో ఉన్న లోపాలను సరిచేయాలన్నారు. సమావేశంలో బి.లక్ష్మి, హరి ప్రియ, సవిత, కవిత, నవీన, సునందా, గంగామణి, లక్ష్మి పాల్గొన్నారు.
