వాటర్ బాటిల్ రూ.3 వేలు, ప్లేట్ భోజనం రూ. 7500

వాటర్ బాటిల్ రూ.3 వేలు, ప్లేట్ భోజనం రూ. 7500

ఆఫ్ఘనిస్థాన్ ను  తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు దీన స్థితికి చేరుతున్నాయి. ఆ దేశం నుంచి బయటపడేందుకు వివిధ దేశస్తులతో పాటు ఆఫ్ఘన్ ప్రజలు కూడా అక్కడి నుంచి బయటపడేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కాబూల్ ఎయిర్ పోర్టుకు వేలాది మంది చేరుకున్నారు. ఏదో ఒక విమానంలో దేశం దాటేందుకు వారు యత్నిస్తున్నారు.

మరోవైపు  ఎయిర్ పోర్టు దగ్గర తాగునీటి కోసం, ఆహారం కోసం నానా పాట్లు పడుతున్నారు. ఆహారం అందక ఎంతోమంది సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇదే అదనుగా కొందరు.. ఎయిర్ పోర్ట్ బయట తాగునీరు,ఆహారాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఒక లీటర్ వాటర్ బాటిల్ ను 40 డాలర్లకు (దాదాపు రూ. 3 వేలు), ఒక ప్లేట్ భోజనాన్ని 100 డాలర్లకు (దాదాపు రూ. 7,500) అమ్ముతున్నారు. మరోవైపు వీటిని ఆఫ్ఘన్ కరెన్సీకి కాకుండా అమెరికా డాలర్లకు అమ్ముతుండటంతో ఆఫ్ఘాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.