వ్యక్తిగత దూషణలు తగవు

వ్యక్తిగత దూషణలు తగవు

వనపర్తి, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, అలాంటి దూషణలు తగవంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్  ఆధ్వర్యంలో ఆదివారం రాజానగరం ప్రజలు ఎమ్మెల్యే మెగారెడ్డి క్యాంపు ఆఫీసును ముట్టడించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, నాయకుల మీద వ్యక్తిగత దూషణలు చేయించడాన్ని వారు ఖండించారు. 

పోలీసులు క్యాంప్​ఆఫీస్​ వద్దకు చేరుకుని వారిని పంపించారు. అనంతరం బీఆర్​ఎస్​ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి, రూరల్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు అశోక్, తిరుమల్, కరుణాకర్, అంజి, చంద్రయ్య, బాలస్వామి, గిరి, రాము తదితరులు పాల్గొన్నారు.