
ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. జూన్ 21వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసింది. అదే రోజున CBI చార్జిషీట్ పై కూడా విచారించనుంది కోర్టు.
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత.. చదువుకోవడానికి 9పుస్తకాలు కావాలని కోర్టును కోరింది. దీనికి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మరోవైపు లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా వేసింది కోర్టు. జూన్ 14న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది రౌస్ అవెన్యూ కోర్టు.