- 15 వందల ఆర్థిక సహాయం నేరుగా వారికే అందిస్తామని కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితుల వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ట్రాన్స్ జెండర్లకు కేంద్రం చేయూతనివ్వాలని నిర్ణయించింది. బిక్షాటనే తప్ప మరో వృత్తి లేనివారే ఎక్కువగా ఉంటున్నారని గుర్తించిన కేంద్రం ట్రాన్స్ జెండర్స్ కు తక్షణ జీవనాధార సహాయాన్ని అందిస్తామని కేంద్ర తెలిపింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్(సిబిఓ) లు, అవసరం ఉన్న ట్రాన్స్ జెండర్స్ వ్యక్తిగతంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెస్ లో తమ వివరాలను సమర్పించాలని కోరింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటీ) ద్వారా నిధులు బాధితులకు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
