ఏపీలో 5.6 లక్షల ఓట్లు తొలగింపు

ఏపీలో 5.6 లక్షల ఓట్లు తొలగింపు

రాష్ట్రంలో 5 లక్షల 60 వేల ఓట్లను తొలగించామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఓటర్లను తొలగించామన్నారు.  తప్పుడు అడ్రస్ లు ,చిరునామా లేకుండా ఒకే ఇంట్లో పదికి మించి  ఓట్లు ఉండటం వంటి సమస్యలపై దృష్టిపెట్టామన్నారు.  2023 అక్టోబర్ 27న జారీ చేసిన  ముసాయిదా జాబితా కంటే ఫైనల్ లిస్టులో 5.8లక్షల ఓట్లు పెరిగాయన్నారు. 

మొత్తం ఏపీలో 4 కోట్ల 8 లక్షల 7 వేల 256 ఓట్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది. వీరిలో  పురుష ఓటర్లు 2 కోట్ల 9 లక్షల 275 మంది, మహిళలు 2 కోట్ల7 లక్షల,36 వేల 65 ఓట్లు ఉన్నట్లు తెలిపింది.  జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను  పార్టీలకు అందించింది.

ఏపీ ఫైనల్ ఓటర్ల లిస్టు

  • మొత్తం ఓటర్లు: 4 కోట్ల 8 లక్షల7 వేల 256
  • పురుషులు: 2 కోట్ల 9 వేల 275
  • మహిళలు: 2 కోట్ల 7 లక్షల 37 వేల 65
  • సర్వీస్ ఓటర్లు 67 వేల 434
  • థర్డ్ జెండర్ ఓటర్లు:34 వేల 82